Imad Wasim: డ్రెస్సింగ్ రూమ్‌లో సిగ‌రెట్ తాగిన పాక్ క్రికెట‌ర్.. ఇదేం ప‌నంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు!

Imad Wasim Spotted Smoking in Dressing Room During PSL 2024 Final
  • డ్రెస్సింగ్ రూమ్‌లో స్మోకింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కిన‌ ఇస్లామాబాద్ ఆట‌గాడు ఇమాద్ వ‌సీం 
  • పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)  ఫైన‌ల్‌లో ఘ‌ట‌న‌
  • ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల‌తో రాణించి.. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన‌ వ‌సీం 

సోమ‌వారం క‌రాచీ స్టేడియంలో జ‌రిగిన పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)  ఫైన‌ల్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించి ఇస్లామాబాద్ యునైటెడ్ టైటిల్ గెలుచుకున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ సంద‌ర్భంగా ఇస్లామాబాద్ ఆట‌గాడు ఇమాద్ వ‌సీం డ్రెస్సింగ్ రూమ్‌లో సిగ‌రెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కాడు. ఇప్పుడీ ఘ‌ట‌న తాలూకు ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ఇక ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఇమాద్ వ‌సీం మంచి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత త‌మ జ‌ట్టు బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఇలా డ్రెస్సింగ్ రూమ్‌లో సిగ‌రెట్ వెలిగించాడు. దీంతో ఇమాద్ చ‌ర్య‌ప‌ట్ల నెట్టింట విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 'డ్రెస్సింగ్ రూమ్‌లో ఇదేం ప‌ని భ‌య్యా..' అంటూ నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, 5 వికెట్లతో ఇస్లామాబాద్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ఇమాద్ వ‌సీం ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. ఇదిలాఉంటే.. తొమ్మిదో సీజ‌న్ పీఎస్ఎల్ విజ‌యంతో ఇస్లామాబాద్ యునైటెడ్ మూడోసారి టైటిల్ గెలిచి చ‌రిత్ర సృష్టించింది.
Imad Wasim
Smoking
Dressing Room
PSL 2024 Final
Multan Sultans
Islamabad United
Cricket
Sports News

More Telugu News