Virat Kohli: విరాట్ కోహ్లీ నయా లుక్‌లో అదిరిపోయాడు..!
- మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం
- న్యూలుక్లో దర్శనమిచ్చిన రన్ మెషీన్
- హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా బయటకు వచ్చిన కోహ్లీ నయా లుక్
- కొత్త లుక్‌లో విరాట్ హాలీవుడ్ హీరోలను తలపిస్తున్నాడని ఫ్యాన్స్ కితాబు
- ఈ నెల 22న చెపాక్ స్టేడియంలో చెన్నైతో ఆర్సీబీ తొలి మ్యాచ్
మరో మూడు రోజుల్లో ఐపీఎల్-2024కు తెరలేవనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో అభిమానులను అలరించేందుకు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఆటతోనే కాకుండా తమ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్‌తో ఆకట్టుకునే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోసం నయా లుక్‌లోకి మారిపోయాడు.
తాజాగా కింగ్ కోహ్లీ న్యూలుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. ఈ నయా లుక్‌లో రన్ మెషీన్ సింప్లి సూపర్బ్‌గా ఉన్నాడు. ఇక విరాట్ కొత్త లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో కోహ్లీ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ న్యూలుక్లో కోహ్లీ హాలీవుడ్ హీరోలను తలపిస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలాఉంటే.. గత రెండు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న కోహ్లీ గత వారం స్వదేశానికి తిరిగొచ్చాడు. లండన్ నుంచి ముంబై చేరుకున్న కోహ్లీ.. సోమవారం బెంగళూరు ట్రైనింగ్ క్యాంపులో చేరాడు. ఇక టీమిండియా తరఫున విరాట్ ఈ ఏడాది జనవరిలో చివరిగా బరిలోకి దిగాడు. ఆఫ్గనిస్థాన్‌తో రెండు టీ20లు ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. కుమారుడు అకాయ్ పుట్టడంతో రెండు నెలలు లండన్‌లోనే గడిపాడు.
ఇక ఐపీఎల్-2024లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 22వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తో ఆడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అంతేగాక ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ 17వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇక ఇప్పటివరకు ఆర్సీబీ ఒక్కసారిగా కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని విషయం తెలిసిందే. దీంతో ఈసారి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగళూరు కప్పు గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మొన్న డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో ఆర్సీబీ మహిళలు టైటిల్ గెలిచారు. ఇదే జోష్‌లో ఆర్సీబీ పురుషుల జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు.