Rachamallu Sivaprasad Reddy: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిపై కేసు నమోదు

Police files case against YCP MLA Rachammalu Sivaprasad Reddy
  • ఏపీలో కోడ్ అమలు
  • ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శివప్రసాదరెడ్డిపై కేసు
  • అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేసినట్టు గుర్తింపు
ఏపీలో ఎన్నికల వేడి బాగా రాజుకుంది. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిపై కేసు నమోదైంది. ఆయనపై ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాదరెడ్డి నిన్న అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేసినట్టు గుర్తించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కోడ్ ఉల్లంఘించారని పోలీసులకు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అదే సమయంలో, వైసీపీ కౌన్సిలర్ రమాదేవి, ఆమె కుమారుడు సురేశ్ పై కూడా కేసు నమోదైంది. 

వాలంటీరు ఆధ్వర్యంలో వైసీపీలో చేరికలు... అధికారుల వేటు

ప్రొద్దుటూరులో వాలంటీరు సుబ్బారావు ఆధ్వర్యంలో వైసీపీలో చేరికలు జరిగాయి. సుబ్బారావు స్థానిక వివేకానంద కాలనీలో పలువురిని వైసీపీలో చేర్చినట్టు గుర్తించారు. వైసీపీ కండువా వేసుకున్న సుబ్బారావు పార్టీ నేతలతో ఫొటో దిగాడు. సుబ్బారావు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో వాలంటీరుగా వ్యవహరిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమం చేపట్టిన వాలంటీరు సుబ్బారావుపై కేసు నమోదైంది. దాంతో, వాలంటీరు సుబ్బారావును అధికారులు విధుల నుంచి తొలగించారు.
Rachamallu Sivaprasad Reddy
Proddutur
Police
Elections
YSRCP
Andhra Pradesh

More Telugu News