G Jagadish Reddy: కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల్లో సగంమంది కేసీఆర్ తయారు చేసిన నాయకులే: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy says congress have not leaders to contest as mp
  • కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే లేరని విమర్శ
  • బీఆర్ఎస్ నాయకులనే అభ్యర్థులుగా పెట్టుకుంటోందని వ్యాఖ్య
  • ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ఆదరిస్తారన్న జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని... ఆ పార్టీకి దిక్కులేక బీఆర్ఎస్ నాయకులనే ఎంపీ అభ్యర్థులుగా పెట్టుకుంటోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో సగం మంది కేసీఆర్‌ తయారు చేసిన నాయకులే అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ఆదరించడం ఖాయమన్నారు. హుజూర్‌నగర్ బీఆర్‌ఎస్ ఇంఛార్జిగా తానే ఉంటానని తెలిపారు.
G Jagadish Reddy
BRS
Lok Sabha Polls
Congress

More Telugu News