IPL 2024 Final: మే 26న ఐపీఎల్ ఫైనల్.. వేదిక ఎక్కడంటే?

IPL 2024 Final On May 26th Match Maybe In Chennai
  • సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి 21 మ్యాచ్‌లకు షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
  • తాజాగా మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ సిద్ధం
  • ఫైనల్ పోరు చెన్నైలోనే!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ తాజాగా మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా రెడీ చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఫైనల్ వేదికను కూడా ఖరారు చేసినట్టు సమాచారం. మే 26న ఫైనల్ జరగనుండగా, దానిని చెన్నైలో నిర్వహించాలని నిర్ణయించినట్టు సీనియర్ అధికారి ద్వారా తెలిసింది.

గత సీజన్‌లో ఫైనల్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈసారి ఓ క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన తాజా షెడ్యూల్‌ను త్వరలోనే బీసీసీఐ ప్రకటించనుంది. రెండు రోజుల క్రితం అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. మ్యాచ్‌లు రంజుగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి.
IPL 2024 Final
Chennai
Ahmedabad
BCCI

More Telugu News