OTT: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించేందుకు రెడీ అయిన చిత్రాలు ఏవంటే..!
- మార్చి 28న థియేటర్లలో సందడి చేయనున్న 'ది గోట్‌లైఫ్'
- ఈ నెల 29న థియేటర్లలోకి 'టిల్లు స్క్వేర్', 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్'
- ఈ వారం ఓటీటీల్లో వస్తున్న 'సుందరం మాస్టర్', 'ఏం చేస్తున్నావ్?', 'ట్రూ లవర్'
మార్చి చివరి వారానికి వచ్చేశాం. దీంతో సీని ప్రియులు ఈ వారాంతంలో థియేటర్లలో సందడి చేసే సినిమాల గురించి సెర్చ్ చేయడం కామన్. అలాగే ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ కూడా నడుస్తోంది. కావున ఓటీటీ వేదికలలో ఈ వారంలో విడుదలయ్యే చిత్రాల పట్ల ఆసక్తి నెలకొనడం సాధారణం. ఈ వారం కొన్ని చిత్రాలు థియేటర్లు, మరికొన్ని ఓటీటీ వేదికగా అలరించేందుకు రెడీ అయ్యాయి. ముందుగా ఈ వారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలను చూద్దాం.
1. టిల్లు స్క్వేర్
'డీజే టిల్లు'గా వచ్చి బాగా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ.. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ మూవీపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. 'డీజే టిల్లు'కు మించిన వినోదం ఈ చిత్రంలో ఉంటుందని దర్శకుడు మల్లిక్ రామ్ అంటున్నారు. టిల్లు స్క్వేర్‌లో సిద్ధు పక్కన అనుపమ పరమేశ్వరన్ నటించింది.
2. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్
హాలీవుడ్ నిర్మాణ సంస్థ 'వార్నర్ బ్రదర్స్' మరో విజువల్ ట్రీట్‌ను అందించేందుకు సిద్ధమైంది. ఆడం విన్‌గార్డ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్' చిత్రాన్ని ఈ నెల 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.
3. ది గోట్‌లైఫ్
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో ఈ మూవీ తెరకెక్కింది. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో 'ఆడు జీవితం' పేరుతో విడుదల అవుతుంది. మార్చి 28న థియేటర్లలో వస్తుంది. 'గోట్ డేస్' నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి బ్లెస్సీ డైరెక్టర్. పృథ్వీరాజ్ సరసన అమలాపాల్ హీరోయిన్‌గా చేసింది. ఇందులోని నబీజ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ చాలా కష్టపడ్డారు. కొన్ని రోజుల పాటు మంచినీళ్లు, బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకుని ఏకంగా 31 కిలోల బరువు తగ్గారట. కేరళ నుంచి పనికోసం ఎడారి దేశానికి వెళ్లిన ఓ యువకుడు అక్కడ ఎలా బానిసగా మారాడు? అక్కడి నుంచి ఎలా తప్పించుకుని స్వదేశానికి చేరాడు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలాగే పూర్తి ఎడారిలో తెరకెక్కిన తొలి భారతీయ మూవీ ఇదేనని సినీ వర్గాలు చెబుతున్న మాట. అంతేగాక పదేళ్ల పాటు ఈ మూవీ షూటింగ్ జరుపుకోవడం గమనార్హం.
ఇక ఈ వారం ఓటీటీలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమైన వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సుందరం మాస్టర్, ఏం చేస్తున్నావ్?, ట్రూ లవర్ చిత్రాల గురించి.
ట్రూ లవర్
'గుడ్‌నైట్', 'జై భీమ్' వంటి చిత్రాలలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కె.మణికందన్. ఈయన హీరోగా నటించిన తాజాగా చిత్రం 'ట్రూ లవర్'. ఇటీవలే ఈ మూవీ తెలుగులో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. ఇప్పుడు మార్చి 27 నుంచి 'డిస్నీ+హాట్‌స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది.
సుందరం మాస్టర్
వైవా హర్ష కీలక పాత్రలో గత నెల థియేటర్లలో వచ్చిన 'సుందరం మాస్టర్' పర్వాలేదనిపించింది. ఈ మూవీ ఇప్పుడు 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఆహాలో సుందరం మాస్టర్‌ను చూడొచ్చు.
ఏం చేస్తున్నావ్?
గతేడాది ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏం చేస్తున్నావ్? కొంచెం ఆలస్యంగా ఓటీటీలోకి వస్తుంది. ఈ నెల 28 నుంచి 'ఈటీవీ విన్'లో ప్రసారం కానుంది. విజయ్ రాజ్‌కుమార్, నేహా పటాని జంటగా భరత మిత్ర ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. నవీన్ కురవ, కిరణ్ కురవ నిర్మాతలు.
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మరికొన్ని చిత్రాలు వెబ్‌సిరీస్‌లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్
* టెస్టామెంట్ (వెబ్‌సిరీస్) - మార్చి 27
* హార్ట్ ఆఫ్ ది హంటర్ (హాలీవుడ్) - మార్చి 29
* ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) - మార్చి 29
* ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ) - మార్చి 30
అమెజాన్ ప్రైమ్
* టిగ్ నొటారో (వెబ్‌సిరీస్) - మార్చి 26
* ది బాక్స్‌టర్స్ (వెబ్‌సిరీస్) - మార్చి 28
డిస్నీ+హాట్‌స్టార్
పట్నా శుక్లా (హిందీ) - మార్చి 29
రెనెగడే నెల్ల్ (వెబ్‌సిరీస్) - మార్చి 29
బుక్ మై షో
ది హోల్డోవర్స్ (హాలీవుడ్) - మార్చి 29
జియో సినిమా
ఎ జెంటిల్‌మ్యాన్ ఇన్‌మాస్క్ (వెబ్‌సిరీస్) - మార్చి 29