Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగు టెస్టులు కాదు... ఐదు టెస్టుల సిరీస్: క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన
- ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టు
- తొలుత నాలుగు టెస్టుల సిరీస్ అంటూ షెడ్యూల్ ప్రకటన
- అదనంగా మరో టెస్టును చేర్చిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు
- 32 ఏళ్ల తర్వాత ఇరుజట్ల మధ్య 5 టెస్టుల సిరీస్
టీమిండియా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగనుందని తొలుత పేర్కొన్నారు. అయితే, ఈ షెడ్యూల్ కు ఓ సవరణ చేశామని, నాలుగు టెస్టులకు బదులు రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుందని క్రికెట్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు) నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ చివరిసారిగా 1991-92లో జరిగింది. మళ్లీ 32 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది నవంబరులో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుండగా, అదనంగా మరో టెస్టు చేర్చిన నేపథ్యంలో, తాజా షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇప్పటిదాకా నాలుగు పర్యాయాలు నిర్వహించగా, అన్నింట్లోనూ టీమిండియానే విజేతగా నిలవడం విశేషం. అందులో రెండు సిరీస్ ల్లో ఆసీస్ ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది.