PBKS vs RCB: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌.. ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

RCB chose to field in IPL 2024 6th Match at Bengaluru
  • బెంగ‌ళూరు వేదిక‌గా ఐపీఎల్ ఆరో మ్యాచ్‌
  • ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిన ఆర్‌సీబీ 
  • తొలి మ్యాచ్‌లో విజ‌యంతో జోష్‌లో పంజాబ్  
బెంగ‌ళూరు వేదిక‌గా ఐపీఎల్ ఆరో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డుతోంది. మొద‌ట టాస్ గెలిచిన బెంగ‌ళూరు కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిన ఆర్‌సీబీ ఈ మ్యాచులో ఎలాగైనా గెల‌వాల‌ని బ‌రిలోకి దిగుతోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో విజ‌యంతో పంజాబ్ జోష్‌లో ఉంది.   

ఆర్‌సీబీ జ‌ట్టు:  డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ర‌జిత్ ప‌టీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, గ్రీన్‌, అనుజ్ రావ‌త్‌, దినేష్ కార్తీక్‌, జోసెఫ్‌, ద‌యాల్‌, ద‌గ‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్.

పీబీకేఎస్ జ‌ట్టు:  శిఖ‌ర్ ధావ‌న్ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, జితేష్ శ‌ర్మ‌, లివింగ్‌స్టోన్‌, శామ్ క‌ర‌న్‌, శ‌శాంక్ సింగ్‌, క‌సిగో ర‌బాడ‌, రాహుల్ చాహ‌ర్‌, బ్రార్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, అర్ష్‌దీప్ సింగ్.
PBKS vs RCB
IPL 2024
Bengaluru
Sports News
Cricket

More Telugu News