Stock Market: ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు
- 361 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 92 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.29
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361 పాయింట్లు కోల్పోయి 72,470కి పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 22,004 వద్ద స్థిరపడింది. టెక్, ఐటీ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.29గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.18%), ఎల్ అండ్ టీ (1.38%), ఎన్టీపీసీ (1.32%), యాక్సిస్ బ్యాంక్ (0.81%), టాటా మోటార్స్ (0.66%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.07%), భారతి ఎయిర్ టెల్ (-1.99%), విప్రో (-1.50%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.11%), కోటక్ బ్యాంక్ (-1.11%).