BJP: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ ఘోష్ తీవ్ర విమర్శలు

BJP MP Father Jab At Mamata Banerjee Trinamool Ja Dilip Ja Reply
  • గోవా వెళితే గోవా కూతురిని, త్రిపుర వెళితే త్రిపుర కూతురినని మమత చెప్పుకుంటారన్న దిలీప్ ఘోష్
  • ఇక్కడ బెంగాల్ కూతురిని అని చెప్పుకునే మమత మొదట తన తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలని వ్యాఖ్య
  • దిలీఫ్ ఘోష్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను బెంగాల్ కూతురిని అని మమతా బెనర్జీ చెప్పుకుంటున్నారని... కానీ మొదట తన తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. మమత గోవాకు వెళ్లి గోవా బిడ్డనని చెబుతుంటారని, త్రిపుర వెళ్లి త్రిపుర బిడ్డనని అంటుంటారని, కానీ తన తండ్రి ఎవరో డిసైడ్ చేసుకోవాలన్నారు. 

తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్

దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. దిలీప్ ఘోష్‌ను తన ప్రస్తుత నియోజకవర్గం నుంచి బీజేపీ అధిష్ఠానం మరో స్థానానికి మార్చిన తర్వాత ఆయనలో అసహనం కనిపిస్తోందని చురక అంటించింది. మరోవైపు, మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని తృణమూల్ కాంగ్రెస్ కోరింది.
BJP
Mamata Banerjee
West Bengal
Lok Sabha Polls

More Telugu News