Nara Lokesh: ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా ప్రజాగ్రహజ్వాలను జగన్ తట్టుకోలేరు: లోకేశ్

People will not bear angry of people even if Jagan gives a kg of gold to each

  • రేణిగుంటలో గోడౌన్ నుంచి పంపకానికి సిద్ధంగా ఉన్న వస్తువుల పట్టివేత
  • మరి జగన్ డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించిన లోకేశ్
  • జగన్ ఐదేళ్ల అరాచక పాలనతో జగన్ విసిగిపోయారన్న టీడీపీ యువనేత

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాజకీయం రంజుగా మారుతోంది. దీనికితోడు ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టేందుకు సిద్ధం చేసిన తాయిలాలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. తాజాగా, రేణిగుంటలో వైసీపీ నేతకు చెందిన గోడౌన్‌లో పంపకానికి సిద్దంగా ఉన్న చేతిగడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతోపాటు మొత్తంగా 52 రకాల వస్తువులను అధికారులు పట్టుకున్నారు. 

దీనిపై టీడీడీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. ఐదేళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన జనం జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలన్న నిర్ణయానికి వచ్చారని ఎక్స్ చేశారు. విషయం తెలిసిన జగన్ చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారని, అది సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేణిగుంటలో చెవిరెడ్డి సిద్ధం చేసిన డంప్‌ను అధికారులు పట్టుకున్నారని ఆయన తెలిపారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్‌ను పట్టుకున్నారని, మరి ఇసుక, లిక్కర్‌లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధంచేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా ప్రజల ఆగ్రహజ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలని లోకేశ్ సూచించారు.

  • Loading...

More Telugu News