Chandrababu: ఇక్కడొక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉంది: నగరిలో చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu held rally in Nagari and comments on minister Roja
  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
  • నగరి చేరుకున్న ప్రజాగళం యాత్రం
  • మంత్రి రోజాపై చంద్రబాబు పరోక్ష విమర్శలు 
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఇక్కడొక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉంది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. 

మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి అనే అమ్మాయి తన వద్దకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుందని చంద్రబాబు వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ గా చేస్తామని ఆమె నుంచి రూ.40 లక్షల రూపాయలు తీసుకున్నారంటే వీళ్లను ఏమనాలి? అంటూ పరోక్షంగా రోజాపై ధ్వజమెత్తారు. ఇలాంటి పనిచేసిన వాళ్లకు మీరు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా వేదికపై ఉన్న కౌన్సిలర్ భువనేశ్వరిని "ముందుకు రామ్మా" అంటూ చంద్రబాబు పిలిచారు. ఆమె వచ్చిన అనంతరం... ప్రజలు ఈ ఆడబిడ్డకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. 

స్థానిక ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే, ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న జగన్ తీరు ఇంకెలా ఉంటుంది? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నగరి నియోజకవర్గం అంతా అరాచకం అని మండిపడ్డారు.
Chandrababu
Nagari
Roja
Praja Galam
TDP
YSRCP

More Telugu News