Congress: కేసీఆర్, కేటీఆర్ కూడా జైలుకు వెళ్లి కవితకు కంపెనీ ఇవ్వాల్సిందే: కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Congress MLA interesting comments on phone tapping issue
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీత
  • మీ ప్రమేయం లేదనుకుంటే లైడిటెక్టర్ టెస్టుకు వస్తారా? అని సవాల్
  • ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు సంపాదించారని ఆరోపణ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు జైలుకు వెళ్లాల్సిందేనని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వారి కుటుంబం మొత్తం తీహార్ జైలుకు వెళ్లి కవితకు కంపెనీ ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు.

ఈ వ్యవహారంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. ఇందులో మీ ప్రమేయం లేకపోతే లైడిటెక్టర్ టెస్టుకు వస్తారా? అని సవాల్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత తీహార్ జైలుకు వెళ్తే కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో క్యాంపులు వేశాడని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం నవీన్ రావు, శ్రవణ్ రావులు సర్వర్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేశారన్నారు.
Congress
Phone Tapping Case
KCR
KTR
K Kavitha

More Telugu News