MP Ganeshamurthi: ఆత్మహత్యాయత్నం చేసిన తమిళనాడు ఎంపీ మృతి

TN MP Ganeshamurthi dies at Coimbatore hospital 4 days after attempting suicide
  • లోక్‌సభ ఎన్నికల టిక్కెట్టు రాలేదని ఈరోడ్ ఎంపీ, ఎమ్‌డీఎమ్‌కే నేత ఎ. గణేశమూర్తి మనస్తాపం
  • ఆదివారం తన ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం
  • కోయంబత్తూర్‌లోని ఓ ఆసుపత్రిలో గురువారం ఉదయం మృతి
ఆత్మహత్యాయత్ననం చేసిన ఈరోడ్ (తమిళనాడు) ఎం‌డీఎంకే ఎంపీ ఎ.గణేశమూర్తి గురువారం కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. తీవ్ర అనారోగ్యం పాలైన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో కోయంబత్తూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గురువారం ఉదయం కన్నుమూశారు. క్రిమిసంహారక మందు తాగి గణేశమూర్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు అంతకుమునుపు కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు.
MP Ganeshamurthi
Tamilnadu
MDMK
LoksabhaPolls

More Telugu News