Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీని పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు

Kejriwal Custody Extended Till April 1st

  • ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
  • తన భర్త ఆరోగ్యం బాగాలేదు... వేధిస్తున్నారన్న కేజ్రీవాల్ భార్య
  • రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో కేజ్రీవాల్ ఆరోగ్యంపై మీడియా ప్రతినిధుల ప్రశ్న
  • ముఖ్యమంత్రిని వేధిస్తున్నారని, ఇందుకు ఢిల్లీ ప్రజలే సమాధానం చెబుతారని వ్యాఖ్య

మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం పొడిగించింది. ఆయన కస్టడీని నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఈడీ మరో ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఏప్రిల్ 1వ తేదీ వరకు కస్టడీకి అప్పగించింది. మార్చి 21న మ‌ద్యం పాల‌సీ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. తొలుత మార్చి 28వ తేదీ వ‌ర‌కు కస్టడీకి అప్పగించారు. ఈరోజు కోర్టు క‌స్ట‌డీని మరోసారి పొడిగించింది.

తన భర్త ఆరోగ్యం బాగాలేదన్న సునీత కేజ్రీవాల్

తన భర్త ఆరోగ్యం బాగాలేదని, ఆయనను వేధిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో కేజ్రీవాల్ ఆరోగ్యంపై మీడియా ప్రతినిధులు అడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆయన ఆరోగ్యం బాగాలేదు... ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని వేధిస్తున్నారని, ఇందుకు ఢిల్లీ ప్రజలే సమాధానం చెబుతారన్నారు.

  • Loading...

More Telugu News