RS Praveen Kumar: దేశంలో ఈడీ దాడులు సరికాదు: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కేంద్రంలో బీజేపీ వస్తే ప్రాథమిక హక్కులు కోల్పోతామన్న ప్రవీణ్ కుమార్
- రిజర్వేషన్ల తీసివేతకు కేంద్రం కుట్రలు చేస్తోందని వ్యాఖ్య
- బీజేపీ, కాంగ్రెస్‌లను గద్దె దించాలని ప్రజలకు పిలుపు
దేశంలో ఈడీ దాడులు సరికాదని బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబానికి పేద ప్రజల బాధలు తెలియవని విమర్శించారు. ఆస్తులు కాపాడుకోవడం కోసం ఆయన కుటుంబం ఆరాటపడుతోందన్నారు. కేంద్రంలో బీజేపీ వస్తే ప్రాథమిక హక్కులు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల తీసివేతకు కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు.
తెలంగాణలో పంటలకు నీరు అందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అంతా బూటకమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేస్తోన్న బీఆర్ఎస్ అభ్యర్థులను ఈ లోక్ సభ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.