Tejas-MK 1A: తొలిసారిగా పూర్తిస్థాయి గగన విహారం చేసిన తేజస్-ఎంకే 1ఏ యుద్ధ విమానం

Tejas jet fighter completes maiden flight in Bengaluru
  • బెంగళూరులో తేజస్ గగన విహారం
  • ఇప్పటికే భారత వాయుసేన అమ్ములపొదిలో చేరిన తేజస్ కొత్త వెర్షన్
  • భారత్ స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తున్న తేలికపాటి పోరాట విమానం
భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్. దీన్ని మరింత ఆధునికీకరించి తేజస్-ఎంకే 1ఏ వెర్షన్ కు రూపకల్పన చేశారు. ఇప్పుడీ సరికొత్త పోరాట విమానం తొలిసారిగా పూర్తిస్థాయిలో విజయవంతంగా గగన విహారం చేసింది. 

ఇప్పటికే ఈ తేలికపాటి యుద్ధ విమానం భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది. ఇవాళ బెంగళూరులో అన్ని హంగులతో, సకల అస్త్రశస్త్రాలను అమర్చుకుని సంతృప్తికరంగా గగన విహారం చేసింది. 

భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్ డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ ఈ ఫైటర్ జెట్ ను డిజైన్ చేసింది. తేజాస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలను ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది. 

గత కొన్నేళ్లుగా అనేక పర్యాయాలు తేజస్ యుద్ధ విమానాలకు ట్రయల్స్ నిర్వహించారు. ఇవాళ్టి గగన విహారం 18 నిమిషాల పాటు సాగింది. రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కేకే వేణుగోపాల్ ఈ విమానాన్ని నడిపారు. త్వరలోనే ఈ విమానాలను వాణిజ్య ప్రాతిపదికన సరఫరా చేసే అవకాశాలున్నాయి.
Tejas-MK 1A
LCA
Jet Fighter
IAF
India

More Telugu News