Adani Power project: చేతులు కలిపిన అంబానీ, అదానీ.. ఇరువురి కంపెనీల మధ్య కుదిరిన కీలక ఒప్పందం

Reliance picks 26 per cent stake in Adani Power project and Ambani and Adani collaborate for first time

  • అదానీ పవర్ ప్రాజెక్ట్‌లో 26 శాతం విద్యుత్ వినియోగానికి ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్
  • ప్రతిగా అదానీ అనుబంధ ‘మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌’లో రిలయన్స్ పెట్టుబడులు
  • 5 కోట్ల ఈక్విటీ షేర్ల కొనుగోలుకు ఇరు కంపెనీల మధ్య డీల్
  • 20 ఏళ్లపాటు విద్యుత్ వినియోగించుకోనున్న రిలయన్స్

భారతీయ టాప్ సంపన్నులు, వ్యాపారరంగంలో ప్రత్యర్థులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదానీ పవర్ విభాగ కంపెనీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మధ్యప్రదేశ్‌లో ఉన్న అదానీ గ్రూప్ అనుబంధ కంపెనీ ‘మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌’లో 26 శాతం వాటా విద్యుత్ వినియోగానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌లో భాగంగా 500 మెగావాట్ల విద్యుత్‌ను రిలయన్స్ వాడుకోనుంది.

ఒప్పందంలో భాగంగా మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను రిలయన్స్ కొనుగోలు చేయనుంది. రూ. 50 కోట్లకు సమానమైన ముఖ విలువ రూ.10 కలిగిన షేర్లను కొనుగోలు చేయనున్నట్టు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో ఇరు కంపెనీలు వెల్లడించాయి. ఈ మేరకు అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ (ఎంఈఎల్), రిలయన్స్  మధ్య 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరిందని వివరించాయి.

  • Loading...

More Telugu News