Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్

  • హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పని చేసిన రాధాకిషన్ రావు
  • రిటైర్ అయ్యాక అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పని చేసిన రాధాకిషన్ రావు
  • ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారంతో అనధికారిక ఆపరేషన్లు చేపట్టినట్లుగా ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గతంలో ఆయన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పని చేశారు. రిటైర్ అయ్యాక అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పని చేశారు. ఎస్ఐబీలో పని చేసిన సమయంలో సస్పెండైన డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. గురువారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనను దర్యాఫ్తు బృందం విచారించింది. ఈరోజు సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు.
Phone Tapping Case
Telangana

More Telugu News