Mayank Yadav: అరంగేట్ర మ్యాచ్‌లోనే గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతి వేసిన ఈ మయాంక్ యాదవ్ ఎవరు?

Who is this Mayank Yadav who registered a ball at a speed of 156 km per hour in his debut match

  • తొలి మ్యాచ్‌లోనే అందరినీ ఆకట్టుకున్న యువ సంచలనం
  • పంజాబ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయంలో కీలక పాత్ర
  • 4 ఓవర్లు వేసి 3 కీలక వికెట్లు తీసిన ఆటగాడు

శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయంలో ఆ జట్టు అరంగేట్ర ఆటగాడు, పేసర్ మయాంక్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లు వేసిన మయాంక్ కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. నయా సంచలనంగా మారిన మయాంక్ యాదవ్‌ శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్‌లో గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతి ఐపీఎల్ 2024లో అత్యంత వేగవంతమైన బాల్‌గా నమోదయ్యింది. ఈ సీజన్‌లో నండ్రే బర్గర్ పేరిట ఉన్న రికార్డును యువ సంచలనం అధిగమించాడు. జానీ బెయిర్‌స్టో రూపంలో ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ను అందుకున్నాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మలను కూడా ఔట్ చేసి లక్నో సూపర్ జెయింట్స్‌ను విజయ తీరాలకు చేర్చాడు.

ఎవరీ మయాంక్ యాదవ్?
ఢిల్లీకి చెందిన పేసర్ మయాంక్ యాదవ్ వయసు కేవలం 21 సంవత్సరాలే. 2022 ఐపీఎల్ మెగా వేలంలో బేస్ ధర రూ.20 లక్షల మొత్తంతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అంతకుముందు రెండు సీజన్లలో అవకాశం ఇవ్వకపోయినప్పటికీ అతడిని జట్టులోనే కొనసాగించింది. అయితే గాయం కారణంగా ఐపీఎల్ 2023 మధ్యలోనే వైదొలిగాడు. అతడు ఇప్పటివరకు ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్, 17 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. నార్త్ జోన్ తరఫున ‘దేవధర్ ట్రోఫీ’లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్ అరంగేట్రానికి ముందు లిస్ట్-ఏ క్రికెట్‌లో 34 వికెట్లు తీశాడు. ఇక టీ20లలో 12, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. మార్క్ ఉడ్ అందుబాటులో లేకపోవడంతో  మయాంక్ యాదవ్‌కు గత రాత్రి చోటు దక్కింది.

  • Loading...

More Telugu News