Atchannaidu: అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ కన్నుమూత... సంతాపం తెలిపిన నారా లోకేశ్

Nara Lokesh condolences to Atchannanidu mother demise
  • అచ్చెన్నాయుడికి మాతృవియోగం
  • ఆమె మరణం కింజరాపు కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్న లోకేశ్
  • ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు వెల్లడి 
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ కన్నుమూశారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అచ్చెన్నాయుడిగారి మాతృమూర్తి కళావతమ్మ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నట్టు వెల్లడించారు. 

అమ్మగారి మరణం కింజరాపు కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కళావతమ్మకు కన్నీటి నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని నారా లోకేశ్ పేర్కొన్నారు.
Atchannaidu
Kalavathamma
Demise
Nara Lokesh
TDP
Andhra Pradesh

More Telugu News