Criminal gangs In AP: పట్టపగలు.. నడివీధిలో కత్తులు ప్రదర్శిస్తున్నారు: నారా లోకేశ్

Criminal gangs are openly flaunting knives and swords in Vizag
  • వైజాగ్ లో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయన్న లోకేశ్ 
  • సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపాటు
  • చట్టాలు, పోలీసుల భయం లేకుండా పోయిందన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలను కాపాడటంలో జగన్ సర్కారు విఫలమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఆరోపించారు. వైజాగ్ సిటీలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నా అదుపు చేయలేకపోవడమే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఈమేరకు సోమవారం లోకేశ్ ఓ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. పట్టపగలు, నడిరోడ్డుపైన రౌడీలు రెచ్చిపోతూ కత్తులను బహిరంగంగా ప్రదర్శిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో క్రిమినల్ గ్యాంగులకు చట్టాలన్నా, పోలీసులన్నా భయంలేకుండా పోయిందని, ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణమని లోకేశ్ ఆరోపించారు. అధికార పార్టీ ఇలాంటి రౌడీలను పెంచి పోషిస్తోందని, తద్వారా రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని ప్రయత్నిస్తోందని నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు.
Criminal gangs In AP
Flaunting Knives
Swords
Vizag city
Gangs
Nara Lokesh
Viral Videos
TDP

More Telugu News