Sri Ramakrishna: సినీ డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత
- అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన శ్రీరామకృష్ణ (74)
- ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి
- బొంబాయి, జెంటిల్‌మాన్, చంద్రముఖి సహా 300 చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీరామకృష్ణ
- చివరిగా రజనీకాంత్ దర్బార్ చిత్రానికి డైలాగ్స్
- బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ చిత్రాలకు దర్శకత్వం
ప్రముఖ సినీ డబ్బింగ్ డైలాగ్ రైటర్ శ్రీరామకృష్ణ (74) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. అక్కడే తుదిశ్వాస విడిచారు. శ్రీరామకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆయన బొంబాయి, జెంటిల్‌మాన్, చంద్రముఖి సహా 300 చిత్రాలకు రచయితగా పనిచేశారు. చివరిగా ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ చిత్రానికి డైలాగ్స్ రాశారు. అలాగే బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఇక రజనీకాంత్‌కు తెలుగు డబ్బింగ్ చెప్పే గాయకుడు మనోను ఆయనకు పరిచయం చేసింది కూడా శ్రీరామకృష్ణే.