Encounter: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి ఎన్‌కౌంట‌ర్‌.. న‌లుగురు మావోయిస్టులు హ‌తం!

Naxalite killed in encounter with security personnel in chhattisgarh bijapur

  • బీజాపూర్ జిల్లా అట‌వీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురుకాల్పులు
  • ఘ‌ట‌నాస్థ‌లి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్న‌ పోలీసులు
  • ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 34 మంది నక్సలైట్ల హ‌తం
  • బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వ‌చ్చే బీజాపూర్ జిల్లాలో ఏప్రిల్ 19వ తేదీన‌ పోలింగ్  

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. బీజాపూర్ జిల్లా అట‌వీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో న‌లుగురు మావోయిస్టులు మృతి చెందారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంట‌ల ప్రాంతంలో గాంగ్లూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో కుంబింగ్ కోసం వెళ్లిన భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఓ సీనియ‌ర్ పోలీస్ అధికారి పీటీఐకి తెలిపారు. దాంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. మావోయిస్టుల‌పై ఎదురుకాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఓ న‌లుగురు మావోయిస్టులు చ‌నిపోగా, ఘ‌ట‌నాస్థ‌లి నుంచి పోలీసులు ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మ‌రోవైపు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు. 

ఈ ఘటనతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 34 మంది నక్సలైట్లు హ‌త‌మ‌య్యార‌ని పోలీసులు తెలిపారు. కాగా, బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మొదటి దశ సాధారణ ఎన్నికలలో భాగంగా ఇక్క‌డ‌ ఏప్రిల్ 19వ తేదీన‌ పోలింగ్ జరగనుంది.

  • Loading...

More Telugu News