Kadiam Srihari: మనవరాలి వయస్సు అమ్మాయి చేతిలో చావుదెబ్బ తిన్నావ్: ఎర్రబెల్లిపై కడియం శ్రీహరి ఆగ్రహం

Kadiyam Srihari fires at Errabelli and Palla Rajeswar Reddy
  • అహంకారపు మాటలు, బలుపు మాటలే ఇంత దూరం తీసుకువచ్చాయంటూ ఎద్దేవా 
  • ఎర్రబెల్లి వంటి వారికి తనపై మరో కోపం ఉందన్న కడియం శ్రీహరి
  • తానేదో అవినీతికి పాల్పడ్డానని.. దోపిడీ చేశానని అంటున్నారని ఆగ్రహం
నీ మనవరాలి వయస్సు ఉన్న అమ్మాయి చేతిలో చావుదెబ్బ తిన్నావు... సిగ్గనిపించడం లేదా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నీ అహంకారం మాటలు, బలుపు మాటలే ఇంత దూరం తీసుకు వచ్చాయి... ఇప్పటికైనా తగ్గించుకోవాలని హితవు పలికారు. ఎందుకు ఓడిపోయావో సమీక్ష చేసుకోవాలని సూచించారు.

ఎర్రబెల్లి వంటి వారికి తనపై మరో కోపం కూడా ఉందన్నారు. మేమంతా ఓడిపోయాం... కడియం శ్రీహరి గెలిచాడనే బాధ వారికి ఉందన్నారు. నేను కూడా ఓడిపోతే బాగుండునని అనుకుంటున్నారని పేర్కొన్నారు. నిప్పు తొక్కిన కోతి కంటే అధ్వానంగా వారి తీరు ఉందన్నారు. ఇక వారి భాష గురించి చెప్పనవసరం లేదన్నారు. తానేదో అవినీతికి పాల్పడ్డానని... దోపిడీ చేశానని అంటున్నారని ధ్వజమెత్తారు.
Kadiam Srihari
BJP
Errabelli
Palla Rajeswar Reddy

More Telugu News