Neelam Upadhyaya: టాలీవుడ్ నటి నీలం ఉపాధ్యాయతో ప్రియాంకచోప్రా సోదరుడి నిశ్చితార్థం

Priyanka Chopra brother Siddharth gets Engaged with Neelam Upadhyaya
  • ఎంగేజ్‌మెంట్ ఫొటోలు పంచుకున్న సిద్ధార్థ్-నీలం
  •  గతంలో ఇషితా కుమార్‌తో సిద్ధార్థ్ నిశ్చితార్థం
  • ఏప్రిల్ 2019లో జరగాల్సిన పెళ్లి రద్దు
  • ‘మిస్టర్ 7’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన నీలం ఉపాధ్యాయ
బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకచోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన నీలం ఉపాధ్యాయ‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నిన్న వీరిద్దరూ ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు షేర్ చేశారు. సిద్ధార్థ్ ఫ్లోరల్ బంద్‌గల సూట్ ధరిస్తే, నీలం సంప్రదాయ పర్పుల్ ఎంబ్రయిడరీ సూట్ ధరించింది. నిశ్చితార్థ కేకుపై ‘జస్ట్ రోకాఫీడ్’ అని రాసివుంది.
 
ప్రియాంక కూడా ఇన్‌స్టా స్టోరీస్‌లో సిద్ధార్థ్, నీలం ఫొటోలను షర్ చేసింది. ఈ ఫొటోల్లో ప్రియాంక భర్త నిక్ జొనాస్ కూడా కనిపించాడు. సిద్ధార్థ్‌కు ఇంతకుముందు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 2019లో వీరి వివాహం జరగాల్సి ఉండగా అనూహ్యంగా రద్దు చేసుకున్నారు.  

నీలం ఉపాధ్యాయ 2010లో తొలి సినిమా చేసినప్పటికీ అది అటకెక్కింది. రెండేళ్ల తర్వాత తెలుగులో ‘మిస్టర్ 7’ అనే సినిమాలో నటించింది. 2013లో అల్లరి నరేశ్‌తో ‘యాక్షన్ త్రీడీ’ నటించింది. అదే ఏడాది ‘ఉన్నోడు ఒరు నాల్’ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది.

Neelam Upadhyaya
Siddharth Chopra
Priyanka Chopra
Bollywood
Siddharth Chopra Engagement
Tollywood

More Telugu News