Boxer Vijender: కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్

Boxer Vijender Singh Switches From Congress To BJP

  • 2019లో కాంగ్రెస్ లో చేరిన విజేందర్
  • దక్షిణ ఢిల్లీ లోక్ సభ స్థానంలో ఓటమి
  • ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తొలి బాక్సర్ గా ఘనత

లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ కాంగ్రెస్ గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. 38 ఏళ్ల విజేందర్ 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజేందర్... బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి చేతిలో ఓడిపోయారు. ఇండియా తరపున బాక్సింగ్ లో తొలి ఒలింపిక్ మెడల్ సాధించి ఘనత విజేందర్ ది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఆయన బ్రోంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. విజేందర్ బాక్సింగ్ ను ఇష్టపడే వారిలో రాహుల్ గాంధీ కూడా ఒకరు. ప్రపంచ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఆయన పతకాలను సాధించారు. 2009లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని పొందారు. 

  • Loading...

More Telugu News