Vijayasai Reddy: టీడీపీ నేతల మెంటాల్టీ ఇలాగే ఉంటుంది: విజయసాయిరెడ్డి

TDP just shows the mentality of TDP Leadership says Vijayasai Reddy
  • టీడీపీ వల్లే పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందన్న విజయసాయిరెడ్డి
  • పెన్షన్ల విషయంలో చంద్రబాబు ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపాటు
  • పెత్తందారుల మనస్తత్వం ఉన్న వారిని ఓడించాలని పిలుపు
ఎన్నికల వేళ ఏపీలో పెన్షన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లతో పెన్షన్లను పంపిణీ చేయించరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, టీడీపీ పెన్షన్లను ఆపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఎక్స్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ... టీడీపీ వల్లే ఏపీలో 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని విమర్శించారు. ఇది టీడీపీ నేతల మెంటాల్టీకి నిదర్శనమని చెప్పారు. తన బినామీలకు, ల్యాండ్ మాఫియా స్నేహితులకు చెల్లింపులు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ డిలే చేయరని... కానీ పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పెత్తందారుల మనస్తత్వం కలిగిన వారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. వైసీపీకి ఓటు వేసి మరోసారి గెలిపించాలని విన్నవించారు.   

Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
AP Politics

More Telugu News