KTR: బీజేపీ నేత‌ల‌ 'ప్రధాని' వ్యాఖ్యలపై కేటీఆర్ చుర‌క‌లు..!

Where did all these people graduate from KTR satirical tweet on BJP
  • బీజేపీ నేత‌లు భార‌త తొలి ప్ర‌ధాని విష‌య‌మై చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత సెటైరిక‌ల్ ట్వీట్
  • భార‌త తొలి ప్ర‌ధాని సుభాష్ చంద్ర‌బోస్ అంటూ నోరు జారిన నటి కంగనా రనౌత్
  • ఇదే విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా కేటీఆర్ సెటైర్లు  
బీజేపీ నేత‌లు భార‌త తొలి ప్ర‌ధాన‌మంత్రి విష‌య‌మై చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' (ట్విట‌ర్) వేదిక‌గా చుర‌క‌లు అంటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న‌ సినీ నటి కంగనా రనౌత్ ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన‌ చర్చా వేదిక‌లో మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ స్వాతంత్ర భార‌త తొలి ప్ర‌ధాని అని నోరు జారారు. ఇదే విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా కేటీఆర్ సెటైర్లు వేశారు. 

"ఉత్తరాదికి చెందిన ఓ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌న తొలి ప్ర‌ధాన‌మంత్రి అని అంటారు. ద‌క్షిణాదికి చెందిన మ‌రో బీజేపీ నేత మ‌హాత్మాగాంధీ మ‌న ప్ర‌ధాని అని చెబుతారు. అస‌లు వీళ్లంతా ఎక్క‌డి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారో?" అని కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.
KTR
BRS
Kangana Ranaut
Bjp
Lok Sabha Polls
Telangana

More Telugu News