Shakeel Ahmed: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కుమారుడి అరెస్ట్‌!

Former BRS MLA Shakeel Ahmed Son Mohammed Raheel Aamir Arrested
  • దుబాయ్ నుంచి వ‌చ్చిన ష‌కీల్ కుమారుడు ర‌హేల్‌
  • విమానాశ్ర‌యంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ప్ర‌జా భ‌వ‌న్ వ‌ద్ద జ‌రిగిన‌ కారు ప్ర‌మాదంలో నిందితుడిగా ర‌హేల్
  • ప్ర‌మాదం త‌ర్వాత దుబాయ్ పారిపోయిన వైనం
బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోధ‌న్‌ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అహ్మ‌ద్‌ కుమారుడు ర‌హేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ర‌హేల్‌ను సోమ‌వారం విమానాశ్ర‌యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌జా భ‌వ‌న్ వ‌ద్ద కారు ప్ర‌మాదంలో ర‌హేల్ నిందితుడిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అత‌ని కోసం గ‌త కొంత‌కాలంగా గాలిస్తున్నారు. 

అయితే, ప్ర‌మాదం త‌ర్వాత ర‌హేల్ దుబాయ్‌కు పారిపోయాడు. ఈ ప్ర‌మాదం త‌ర్వాత ర‌హేల్‌కు బ‌దులుగా మరొక‌రిని డ్రైవ‌ర్‌గా చేర్చి.. ర‌హేల్ దుబాయ్ పారిపోవ‌డం జ‌రిగింది. దాంతో పోలీసులు ర‌హేల్‌పై వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి, అత‌ని కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో ఇవాళ‌ ర‌హేల్ దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు తిరిగి రాగా, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ష‌కీల్‌ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చ‌డం జ‌రిగింది. సాక్ష్యాల‌ను తారుమారు చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న‌పై పోలీసులు అభియోగాలు మోపారు. 
Shakeel Ahmed
BRS
MLA
Mohammed Raheel Aamir

More Telugu News