Vemireddy Prabhakar Reddy: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రచారం, టీడీపీని వీడడం లేదు: వేమిరెడ్డి స్పష్టీకరణ

Campaign to mislead people Not leaving TDP told Vemireddy Prabhakar Reddy
  • పార్టీ మార్పు ఊహాగానాలను నమ్మవద్దన్న వేమిరెడ్డి
  • నెల్లూరు ఎంపీ స్థానం నుంచి తాను, అసెంబ్లీ స్థానం నుంచి ప్రశాంతిరెడ్డి సైకిల్ గుర్తుపై గెలవబోతున్నామన్న నేత
  • ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి వైసీపీ తట్టుకోలేకపోతోందన్న ప్రశాంతిరెడ్డి
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తాను, కోవూరు అసెంబ్లీ నుంచి ప్రశాంతిరెడ్డి పోటీలో ఉన్నట్టు చెప్పారు. సైకిల్ గుర్తుపై తామిద్దరం గెలవబోతున్నట్టు ధీమా వ్యక్తంచేశారు. 

నెల్లూరులోని తన నివాసంలో నిన్న సాయంత్రం ఆయన మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణను చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని, టీడీపీలోకి వలసలు పోటెత్తుతుండడంతో కొందరు అసూయ పడుతున్నారని ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు.
Vemireddy Prabhakar Reddy
Vemireddy Prashanthi Reddy
Nellore District
Telugudesam

More Telugu News