AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్!

AP Inter exams results will be releases in this week
  • ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి
  • ఈరోజు నుంచి మూల్యాంకనం పునఃపరిశీలన
  • ఈ వారాంతంలోగా ఫలితాల విడుదలకు ఏర్పాట్లు
ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ వారాంతంలోగా ఫలితాలను విడుదల చేసేందుకు ఏపీ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఈరోజు నుంచి జవాబు పత్రాల మూల్యాంకనంను పునఃపరిశీలన చేయనున్నారు. అనంతరం మార్కులను డిజిటల్ గా నమోదు చేసి ఫలితాలను విడుదల చేస్తారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20 వరకు జరిగాయి. ఫస్టియర్, సెకండియర్ కలిపి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలతో పలు పోటీ పరీక్షలకు లింక్ ఉండటంతో ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
AP Inter Results
Inter Exams
Andhra Pradesh

More Telugu News