Vijaya Chamundeshwari: నాన్నను అమ్మ దూరం పెట్టడానికి కారణం వాళ్లే: సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి

Vijay Chamundeshwari Interview

  • భానుమతి గారు చెప్పినా అమ్మ వినిపించుకోలేదన్న విజయ్ చాముండేశ్వరి
  • అమ్మ చుట్టూ స్వార్థపరులు చేరారని వెల్లడి 
  • నాన్నను అమ్మ ఇంటికి రానీయలేదని వ్యాఖ్య 
  • తమ్ముడి బాధ్యత నాన్న తీసుకున్నారని వివరణ  


సావిత్రి చనిపోయి చాలాకాలమే అయింది. అప్పటి నుంచి ఆమె ఫ్యామిలీ గురించిన విషయాలు చాలామందికి తెలియదు. 'మహానటి' సినిమా సమయంలోనే సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ఎక్కువగా తెలిశారు. ఇక అప్పటి నుంచి అనేక ఇంటర్వ్యూల ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యారు. 'సావిత్రి క్లాసిక్స్' పేరుతో ఆమె ఒక పుస్తకం వేశారు. ఆ పుస్తక ఆవిష్కరణ కూడా ఇటీవల చిరంజీవి చేతుల మీదుగా జరిగింది. 

తాజాగా 'ట్రీ మీడియా' ఇంటర్వ్యూలో విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ .. "అమ్మా .. నాన్నల మధ్య కొన్ని విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి. అయితే అవి మాట్లాడుకుంటే పోయేవే. కానీ కొంతమంది ఆమెకి నాన్న గురించి నెగెటివ్ గా చెప్పారు. అలా చెప్పేవారు ఎక్కువైపోవడంతో ఆమె నమ్మేసింది. అమ్మకి నాన్న దూరం కావడం వలన వాళ్లు లాభపడ్డారు. వాళ్ల కారణంగా అమ్మకి నాన్న దూరమయ్యారు" అని చెప్పారు. 

"అమ్మను చూడటానికి మా నాన్నగారు గోడదూకి ఇంట్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాన్న ఇంట్లో ఉన్నంత వరకూ అమ్మబాగానే ఉంది. ఆయనను ఆ ఇంటి నుంచి దూరం చేసిన తరువాతనే ఆమె పరిస్థితిలో మార్పు వచ్చింది. అమ్మకి భానుమతిగారు ఎన్నో రకాలుగా నచ్చజెప్పారు. అయినా ఆమె వినిపించుకోలేదు. అమ్మ చనిపోయిన తరువాత తమ్ముడికి సంబంధించిన అన్ని వ్యవహారాలు నాన్నగారే చూసుకున్నారు" అని అన్నారు. 

  • Loading...

More Telugu News