YS Viveka Murder Case: వివేకా హత్య కేసు: శివశంకర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court issues notice to Viveka murder case accused Sivashankar Reddy
  • వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి
  • ఇటీవల బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
  • హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన వివేకా కుమార్తె సునీతా రెడ్డి 
వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శివశంకర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. ఆమె పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. శివశంకర్ రెడ్డి సహా ఈ కేసులో ప్రతివాదులకు జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 22కి వాయిదా వేసింది.
YS Viveka Murder Case
Sivashankar Reddy
Bail
Supreme Court
Suneetha Reddy
Telangana High Court

More Telugu News