Stock Market: విదేశీ ఇన్వెస్ట్ మెంట్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 494 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 152 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా లాభపడ్డ మారుతి, ఎం అండ్ ఎం షేర్ల విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సానుకూలతలు, వెల్లువెత్తుతున్న విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు మార్కెట్లలో జోష్ ను నింపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 494 పాయింట్లు లాభపడి 74,742కి పెరిగింది. నిఫ్టీ 152 పాయింట్లు పుంజుకుని 22,666 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (3.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.22%), ఎన్టీపీసీ (2.54%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.39%), ఎల్ అండ్ టీ (1.92%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.59%), విప్రో (-1.09%), సన్ ఫార్మా (-0.51%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.37%), టైటాన్ (-0.32%).