Mamata Banerjee: మోదీ గ్యారెంటీ అంటే ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించడమే...: మమతా బెనర్జీ కౌంటర్

Modi Guarantee Is Opposition Will Be Jailed After Polls says Mamata Banerjee

  • జూన్ 4 తర్వాత అవినీతి నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ చెప్పారన్న దీదీ
  • అలా చెప్పడమంటే ప్రతిపక్ష నేతలను జైల్లో పెడతామనే అర్థమని వ్యాఖ్య
  • ఇదే మోదీ గ్యారెంటీ అని మమతా బెనర్జీ ఆగ్రహం

మోదీ గ్యారెంటీ అంటే ప్రతిపక్ష నేతలను జైలుకు పంపించడమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. బీజేపీ మోదీ గ్యారెంటీ అని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో దీనికి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. జూన్ 4 తర్వాత అవినీతి నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ చెప్పారని, అలా చెప్పడమంటే ప్రతిపక్ష నేతలను జైల్లో పెడతామనే అర్థం అన్నారు. ఇదే మోదీ గ్యారెంటీ అని విమర్శించారు. ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌కు వెళ్లినట్లు ఆరోపించారు.

ప్రధాని మోదీ ప్రచారంలో భాగంగా బెంగాల్‌కు వస్తున్నారని... ఇందులో తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కానీ లోక్ సభ ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రధానిస్థాయి వ్యక్తి ఇలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత బీజేపీ నేతలను జైల్లో పెడతానని నేను చెబితే ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఇది సరైనదేనా? అని ఆమె మండిపడ్డారు.

  • Loading...

More Telugu News