Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాఫ్తుకు పిటిషన్... విచారణ 10కి వాయిదా

High Court on Kaleswaram Project petitions
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాఫ్తు జరపాలన్న పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
  • ఈ ఐదు పిటిషన్లపై కలిపి ఎల్లుండి విచారణ చేపడతామన్న హైకోర్టు
  • ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ వేశామన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాఫ్తు జరపాలన్న పిటిషన్లపై విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన తెలంగాణ హైకోర్టు... ఈ ఐదు పిటిషన్లను కలిపి ఎల్లుండి విచారణ చేపడతామని తెలిపింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ వేశామని కోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఇప్పటికే జ్యూడీషియల్ విచారణ వేసినందువల్ల సీబీఐ విచారణ అవసరం లేదన్నారు.
Kaleshwaram Project
Telangana
CBI
TS High Court

More Telugu News