Find My Device: మీ ఫోన్ కనిపించడం లేదా?.. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా కనిపెట్టేయొచ్చు!

Google Rolls Out Upgraded Find My Device Network
  • ‘ఫైండ్ మై డివైజ్’ను అప్‌గ్రేడ్ చేసిన గూగుల్
  • ఆండ్రాయిడ్ 9, ఆ తర్వాతి వెర్షన్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుందన్న గూగుల్
  • బ్లూటూత్ ప్రాక్సిమిటీ ద్వారా పనిచేస్తుందన్న సెర్చింజన్ దిగ్గజం
మీరు ఎంతో ఇష్టంగా చూసుకునే మొబైల్ పోయిందా? అది ఆఫ్‌లో ఉందా? ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా లేదా? అయినా మరేం పర్లేదు. ఈజీగా కనిపెట్టేయొచ్చు. నెట్‌వర్క్ లేకున్నా, ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నా ఇక అది సమస్యే కాబోదు. ఎందుకంటే గూగుల్ ఇప్పుడు తన ‘ఫైండ్ మై డివైజ్’ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. అయితే, ఇది ఆండ్రాయిడ్ 9, ఆ తర్వాతి వెర్షన్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

ఇదెలా పనిచేస్తుంది?
ఈ అప్‌డేటెడ్ వెర్షన్ నెట్‌వర్క్ లేకున్నా బ్లూటూత్ ప్రాక్సిమిటీ ద్వారా పనిచేస్తుంది. యాపిల్ ఫోన్లలోని ‘ఫైండ్ మై డివైజ్’ నెట్‌వర్క్స్‌‌లానే ఇది పనిచేస్తుంది. అయితే, యాపిల్ కంటే ఇది మరింత శక్తిమంతమైనది. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రొ ఫోన్లు స్విచ్చాఫ్ అయినా కూడా వాటి యజమానులు వాటిని ఈజీగా కనిపెట్టవచ్చని గూగుల్ చెబుతోంది. ఇందుకోసం వాటిలో ‘స్పెషలైజ్డ్ హార్డ్‌వేర్’ను ఉపయోగించింది.  ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, కెనడాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానున్నట్టు గూగుల్ తెలిపింది.
Find My Device
Google
Apple
Android 9
Internet
Phone Network
Tech-News

More Telugu News