Truecaller: ట్రూ కాలర్ వెబ్ వచ్చేసింది... ఇక డెస్క్ టాప్ లోనూ కాలర్ ఐడీ సేవలు

Truecaller brings web version for android users
  • గుర్తు తెలియని నెంబర్లను గుర్తించే యాప్ గా ట్రూ కాలర్ ఫేమస్
  • కొత్త ఫీచర్ తీసుకువచ్చిన ట్రూ  కాలర్
  • ఇకపై డెస్క్ టాప్ లోనూ ట్రూ కాలర్
గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ఐడెంటిటీని తెలుసుకునేందుకు మనం ట్రూ కాలర్ యాప్ ను ఉపయోగిస్తుంటాం. ఇప్పుడీ ట్రూ కాలర్ యాప్ ఇకపై వెబ్/డెస్క్ టాప్ లోనూ సేవలు అందించనుంది. ఈ మేరకు కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. 

ఫోన్ లో ట్రూ కాలర్ యాప్ ఓపెన్ చేసి, మెసేజెస్ ట్యాబ్ క్లిక్ చేసి మెనూలోకి వెళ్లాలి. మెసేజింగ్ ఫర్ వెబ్ పై క్లిక్ చేసి... కంప్యూటర్ స్క్రీన్ పై web.truecaller.com సైట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ ట్రూ కాలర్ వెబ్ వెర్షన్ రెడీ. 

ప్రముఖ సోషల్ మెసేజింగ్ సైట్ వాట్సాప్... వెబ్ వెర్షన్ ను ఎప్పటి నుంచో కొనసాగిస్తోంది. ఈ తరహాలోనే ట్రూ కాలర్ వెబ్ కూడా ఎంట్రీ ఇచ్చింది. తొలుత ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. 

యూజర్లు తమ ఫోన్ ను కంప్యూటర్ కు కనెక్ట్ చేయడం ద్వారా కాల్ అలెర్ట్ లను, ఎస్ఎంఎస్ లను డెస్క్ టాప్ స్క్రీన్ పై చూడొచ్చు. మొబైల్ తరహాలోనే డెస్క్ టాప్ వెర్షన్ కూడా ఎన్ క్రిప్షన్ విధానంలో పూర్తిగా సురక్షితం అని ట్రూ కాలర్ వెల్లడించింది.
Truecaller
Web Version
Desktop
Android

More Telugu News