Google Vids: ఏఐ ఆధారిత ‘ వర్క్‌స్పేస్ వీడియో క్రియేషన్ టూల్‌’ను తీసుకొచ్చిన గూగుల్

Google has made available an AI based video creation tool Google Vids
  • కొత్త వర్క్‌స్పేస్ యాప్‌ను పరిచయం చేసిన సెర్చింజన్ దిగ్గజం
  • సోమవారం జరిగిన ‘క్లౌడ్ నెక్స్ట్ 2024’ ఈవెంట్‌లో టూల్‌ని పరిచయం చేసిన గూగుల్
  • రీక్యాప్ వీడియోలు, అనౌన్స్‌మెంట్ వీడియోల రూపకల్పనకు అవకాశం
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మరో కొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘గూగుల్ విడ్స్’ అనే వర్క్‌స్పేస్ యాప్‌ను పరిచయం చేసింది. ఏఐ ఆధారిత ఈ టూల్ ద్వారా వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. సోమవారం జరిగిన ‘క్లౌడ్ నెక్స్ట్ 2024’ ఈవెంట్‌లో ఈ టూల్‌ను గూగుల్ పరిచయం చేసింది.

డాక్స్, షీట్స్, స్లయిడ్‌ వంటి గూగుల్ టూల్స్‌తో పాటుగా పర్పుల్ డాక్యుమెంట్ ఐకాన్‌‌తో ఇది అందుబాటులో ఉంది. ఐకాన్ మధ్యలో ‘ప్లే బటన్’తో కనిపిస్తోంది. ఈ టూల్‌ని ఉపయోగించి రీక్యాప్‌ వీడియోలు, అనౌన్స్‌మెంట్ వీడియోలు, ట్రైనింగ్ రీల్స్‌తో పాటు మరిన్ని వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ ఇంటర్‌ఫేస్‌తో గూగుల్ దీనిని రూపొందించింది. ఇతరులకు షేర్ చేయడంతో పాటు వీడియో మేకింగ్ సహకారాన్ని కూడా ఏర్పరచుకోవచ్చు.

‘హెల్ప్ మీ క్రియేట్ ఏ వీడియో’ ఆప్షన్‌పై క్లిక్ చేసి వీడియో క్రియేషన్‌ను యూజర్లు ప్రారంభించవచ్చు. వీడియో దేని కోసం, ఏ కేటగిరి వ్యూయర్స్ కోసం వంటి ఆలోచనలతో పాటు వీడియో సైజుని సూచించాలి. అనంతరం ‘ఎట్‌ ది రేట్’ని (@) టైప్ చేసి  గూగుల్ డ్రైవ్‌లోని ఫొటోలను అటాచ్ చేయవచ్చు. ఏఐ ఆధారిత ఎడిటింగ్‌కు అవకాశం ఉంటుంది. క్వాలిటీ ఫొటోలు, వీడియోలు, సౌండ్ ఎఫెక్ట్‌లను యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు వాయిస్‌ఓవర్ ప్రాసెస్‌ కోసం రికార్డింగ్ స్టూడియో ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రీసెట్ వాయిస్‌ని ఎంచుకునేందుకు వీలుంటుంది.
Google Vids
Google
Video Creation

More Telugu News