National Herald: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో చుక్కెదురు

PMLA authority upholds EDs attachment of assets worth Rs 752 crore

  • ఆస్తుల అటాచ్ సబబేనన్న పీఎంఎల్ఏ అథారిటీ
  • మనీలాండరింగ్ కేసులో రూ.752 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
  • దీనిపై న్యాయపోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఇన్ కం ట్యాక్స్ కు సంబంధించి నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ.. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. తర్వాత రిలీజ్ చేసినప్పటికీ వంద కోట్లకు పైగా నిధులను బ్లాక్ చేసింది. దీంతో పార్టీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఖర్గే, రాహుల్ సహా పలు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేషనల్ హెరాల్డ్ పేపర్ సహా పలు సంస్థలకు చెందిన రూ.752 కోట్ల ఆస్తులను గతేడాది సీజ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం బాటపట్టి, పీఎంఎల్ఏ అథారిటీని ఆశ్రయించింది. తాజాగా, ఈ విషయంపై తీర్పు చెబుతూ.. ఆస్తుల అటాచ్ సబబేనని పీఎంఎల్ఏ అథారిటీ బుధవారం తేల్చిచెప్పింది. ఈడీ ఎటాచ్‌ చేసిన చరాస్తులు, ఈక్విటీ వాటాలు మనీలాండరింగ్‌ నేరానికి సంబంధించినవిగా భావిస్తున్నట్లు పేర్కొంది.

ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు..
స్వాతంత్య్రానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ మరికొందరు స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. నష్టాల కారణంగా ఈ పత్రిక 2008 లో మూతపడింది. కంపెనీ నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ‘యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్’ రూ.90 కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో పాటు సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగపరిచిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలతో నేషనల్ హెరాల్డ్ నష్టాల్లో కూరుకుపోయింది. యంగ్ ఇండియన్ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో సోనియా, రాహుల్ ఉండడం గమనార్హం. ఈ కంపెనీని 2010లో ఏజీఎల్ కొనుగోలు చేసింది. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియన్ సంస్థల వ్యవహారాల్లో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాఫ్తు చేపట్టింది. గతేడాది నేషనల్ హెరాల్డ్ కు చెందిన పలు ఆస్తులను జఫ్తు చేసింది.

  • Loading...

More Telugu News