Revanth Reddy: షబ్బీర్ అలీ ఇంట్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. వీడియో ఇదిగో

Revanth Reddy Ramzan celebrations in Shabbir Ali residence
  • షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లిన రేవంత్, దానం నాగేందర్
  • షబ్బీర్ ఇంట్లో విందు ఆరగించిన వైనం
  • ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్
ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్. ఈరోజు రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటికి రేవంత్ వెళ్లారు. ఆయనతో పాటు సికింద్రాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కు షబ్బీర్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. షబ్బీర్ అలీకి, అక్కడున్న ఇతర ముస్లిం పెద్దలకు రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరితో కలిసి ముఖ్యమంత్రి విందు ఆరగించారు. 

మరోవైపు రంజాన్ సందర్భంగా ముస్లింలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ రంజాన్ పండుగను ముస్లింలందరూ తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.
Revanth Reddy
Shabbir Ali
Danam Nagender
Congress
Ramzan

More Telugu News