Indiramma Committees: తెలంగాణలో త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు.. అన్ని పథకాలు ఈ కమిటీల ద్వారానే..!
- ఒక్కో కమిటీలో ఐదుగురు సభ్యులు
- ఒక్కో సభ్యుడికి నెలకు రూ. 6 వేల గౌరవ వేతనం
- రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల మంది సభ్యులను నియమించే అవకాశం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను చేయబోతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఈ కమిటీల ద్వారానే ప్రతి ఇంటికీ చేరనున్నాయి. ఏ పథకానికైనా లబ్ధిదారులను ఈ కమిటీల ద్వారానే ఎంపిక చేస్తారు. ఒక్కో కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. కమిటీలోని ఒక్కో సభ్యుడికి నెలకు రూ. 6 వేల గౌరవ వేతనం ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల మందిని కమిటీల సభ్యుడిగా నియమించబోతున్నారు. ఏపీలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల మాదిరి తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు పని చేస్తాయి. ఈ కమిటీలను కాంగ్రెస్ కేడర్ తో ఏర్పాటు చేయనున్నారు.