Swiggy: స్విగ్గీ డెలివ‌రీ బాయ్ నిర్వాకం.. ఇంటి ముందు నుంచి షూస్ ఎత్తుకెళ్లిన వైనం.. వీడియో వైర‌ల్!

Swiggy delivery boy steals pair of shoes kept outside flat Video goes Viral on Social Media
  • ఈ నెల 9వ తేదీన గురుగ్రామ్‌లో ఘ‌ట‌న‌ 
  • సోష‌ల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన బాధితుడు
  • నెట్టింట వీడియో వైర‌ల్ కావ‌డంతో స్పందించిన స్విగ్గీ  
ఓ స్విగ్గీ డెలివ‌రీ బాయ్ ఓ ఇంటి ముందు నుంచి షూలను దొంగిలించిన ఘ‌ట‌న‌ గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో కాస్తా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడ‌ది నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన జరిగింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన‌ ఫుటేజీ చూసిన రోహిత్ అరోరా అనే వ్యక్తి తన స్నేహితుడి షూల‌ను స్విగ్గీ డెలివ‌రీ బాయ్ ఎత్తుకెళ్లాడంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. స్విగ్గీకి ఫిర్యాదు కూడా చేశాడు. 

వీడియోలోని దృశ్యాల ఆధారంగా..  ఇంటి బయట నైక్ కంపెనీ షూ ఉండ‌డం డెలివరీ ఇచ్చి వస్తోన్న స్విగ్గీ డెలివరీ బాయ్ కంట‌పడింది. దాంతో వాటిని కొట్టేయాలని అనుకున్నాడు. ఆ ఇంట్లో ఎవరన్న ఉన్నారా లేదా అని నిర్ధారించడానికి డోర్ బెల్ కొట్టాడు. డోర్‌ తీయకపోవడంతో ఎవరు లేరని నిర్ధారించుకున్నాడు. కొన్ని మెట్లు కింద‌కు దిగి, కింద నుంచి ఎవ‌రైనా పైకి వ‌స్తున్నారేమోన‌ని చెక్ చేసుకున్నాడు. మళ్లీ వెన‌క్కి తిరిగొచ్చాడు. ఆ షూ తీసుకొని, త‌న వ‌ద్ద ఉన్న టవల్‌లో వాటిని చుట్టుకున్నాడు. అనంత‌రం అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఘ‌ట‌న‌పై స్పందించిన స్విగ్గీ
ఘ‌ట‌నకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావ‌డంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో స్విగ్గీ స్పందించింది. 'డెలివరీ పార్ట్‌నర్ల నుంచి మంచిని ఆశిస్తున్నామని' ప్రకటించింది. ఆ కామెంట్‌పై ఓ 'ఎక్స్' (ట్విట‌ర్‌) యూజర్ స్పందించాడు. షూ పొగొట్టుకున్న వ్య‌క్తికి వాటి ధరను స్విగ్గీ ఇవ్వాలని కోర‌డం జ‌రిగింది. నైక్ షూ అయినందున ధర ఎక్కువగా ఉంటుందని యూజ‌ర్‌ పేర్కొన్నాడు.
Swiggy
Delivery boy
Social Media
Gurugram
Viral Videos

More Telugu News