Peddireddi Ramachandra Reddy: రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy alleges Nara Lokesh has threatened with Red Book
  • చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
  • హామీలన్నీ నెరవేర్చామని, ప్రజలు తమవైపే ఉన్నారని ధీమా
  • లోకేశ్ బెదిరింపులకు వైసీపీలో ఎవరూ భయపడరని వెల్లడి
  • చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ లేకనే పొత్తు పెట్టుకున్నాడని ఎద్దేవా 
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. హామీలన్నీ నెరవేర్చామని, ప్రజలు తమవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. 

గెలిస్తే ఏం చేస్తారో కూటమి నేతలు చెప్పడంలేదని, జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన భవిష్యత్ కు గ్యారెంటీ లేకనే పొత్తు పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. 

రెడ్ బుక్ పేరు చెప్పి నారా లోకేశ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. లోకేశ్ బెదిరింపులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
Peddireddi Ramachandra Reddy
Nara Lokesh
Red Book
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News