Seethakka: కేటీఆర్ దురహంకారి: మంత్రి సీతక్క ఆగ్రహం

Minister Seethakka fires at BRS working president ktr
  • కేటీఆర్‌కు ఆడవాళ్లంటే గౌరవం లేదని విమర్శ
  • తెలంగాణ ప్రజల త్యాగాల పునాదులపై వారికి పదవులు వచ్చాయని వ్యాఖ్య
  • కేటీఆర్... నోరు జారకు, డబ్బులేనోళ్లు అనామకులా? అని నిలదీత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దురహంకారి అని మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం తాండూర్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఆయనకు ఆడవాళ్లంటే గౌరవం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల త్యాగాల పునాదులపై వారికి పదవులు వచ్చాయన్నారు. కేటీఆర్... నోరు జారకు, డబ్బు లేనోళ్లు అనామకులా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలాగా దోచుకున్న డబ్బు తమ వద్ద లేదన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100 రోజుల్లోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎన్నికల కోడ్ తర్వాత మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
Seethakka
Congress
KTR
Lok Sabha Polls

More Telugu News