Rohit Sharma: బస్సు డ్రైవర్ గా రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో!

Rohit Sharma Turns Bus Driver For Mumbai Indians Team Video Viral
  • ముంబై ఇండియన్స్ టీమ్ బస్సులో మాజీ కెప్టెన్ సందడి
  • రోహిత్ తో కలిసి జట్టు సభ్యుల హడావుడి
  • స్టేడియం బయట సంతోషంతో అభిమానుల కేకలు
ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ శనివారం బస్సు డ్రైవర్ గా మారాడు. జట్టు సభ్యులను హోటల్ కు తీసుకెళ్లేందుకు వచ్చిన బస్సులోకి ఎక్కిన రోహిత్.. డ్రైవర్ సీట్లో కూర్చుని కాసేపు సందడి చేశాడు. బస్సు ముందున్న అభిమానులు, మీడియా వాళ్లను పక్కకు జరగాలంటూ సైగలు చేస్తూ డ్రైవ్ చేస్తున్నట్లే హడావుడి చేశాడు. దీంతో అభిమానులు సంతోషంతో కేకలు వేశారు. బస్సులోకి ఎక్కిన ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు కూడా రోహిత్ తో కలిసిపోయారు. జట్టు మొత్తం సరదాగా అభిమానులను అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, రోహిత్ నిజంగా బస్సును నడపలేదని, సరదాగా కాసేపు డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేసినట్లే నటించాడని ముంబై ఇండియన్స్ ప్రతినిధి వివరణ ఇచ్చారు.
Rohit Sharma
Bus Driving
Driver Rohit
Mumbai Indians
IPL 2024
Sports

More Telugu News