KA Paul: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్

KA Paul complains on Kaleshwaram Project to CBI
  • కాళేశ్వరంలో రూ. 50 వేల కోట్ల అవినీతి జరిగిందన్న కేఏ పాల్
  • సీబీఐ విచారణ కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రేవంత్ లేఖ రాయాలని డిమాండ్ 
  • కాళేశ్వంలో అవినీతి బయటకు వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్య
ఇండియాలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. కోఠీలోని సీబీఐ కార్యాలయంలో డీజీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 50 వేల కోట్ల అవినీతి జరిగిందని సీబీఐకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించిన నివేదిక ఉందని... అయినప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని తెలిపారు. 

ఎన్నికల సమయంలో కాళేశ్వంలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించిన సీఎం రేవంత్... ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రేవంత్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతి బయటకు వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 370 కంటే ఎక్కువ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆరోపించారు.
KA Paul
Kaleshwaram Project
CBI

More Telugu News