Gujarat: సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన షూటర్ల అరెస్ట్

The shooters who opened fire on Salman Khan residence in Mumbai have been arrested in Gujarat
  • గుజరాత్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
  • సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్
  • విచారణ కోసం ముంబైకి తరలిస్తామని చెప్పిన అధికారులు
ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని భుజ్‌లో సోమవారం అర్ధరాత్రి వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు ధ్రువీకరించారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి గుజరాత్ పారిపోయారని పోలీసులు అధికారులు వివరించారు. విచారణ కోసం వీరిని ముంబైకి తీసుకొస్తామని తెలిపారు.

కాగా ఆదివారం తెల్లవారుజామున కాల్పుల ఘటన జరిగింది. సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మోటారుసైకిల్‌పై వచ్చిన నిందితులు హెల్మెట్‌లు ధరించారు. పక్కా ప్రణాళికతో నాలుగు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. సల్మాన్‌ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచాలని ముంబై పోలీస్ కమిషనర్‌తో సూచించారు.
Gujarat
Salman Khan
Mumbai
Shooting incident

More Telugu News