Dhanush: ధనుష్, ఐశ్యర్య ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఉత్తర్వులు

Court directs Dhanush and Aishwarya Rajinikanth to appear physically
  • విడాకులకు దరఖాస్తు చేసుకున్న ధనుష్, ఐశ్వర్య
  • అక్టోబర్ 7న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలన్న జడ్జి
  • రెండేళ్ల నుంచి విడివిడిగా ఉంటున్న స్టార్ కపుల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్యర్య విడాకుల విషయంలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్యర్య, ధనుష్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 18 ఏళ్ల పాటు కలిసి జీవించిన ధనుష్, ఐశ్వర్య తాము విడిపోతున్నట్టు 2022లో ప్రకటించారు. పలు కారణాల వల్ల తాము విడిపోతున్నట్టు వీరు వెల్లడించారు. ఈ ప్రకటనతో అందరూ షాక్ కు గురయ్యారు. ఇద్దరినీ కలిపేందుకు రజనీకాంత్ ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. 

కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పిటిషన్ ను నిన్న జడ్జి సుభాదేవి విచారించారు. అక్టోబర్ 7న ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. 

మరోవైపు రెండేళ్ల నుంచి ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ వేర్వేరుగానే నివసిస్తున్నారు. కుమారులిద్దరూ ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. అప్పుడప్పుడు తండ్రి ధనుష్ వద్దకు వెళ్లి వస్తుంటారు. 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ధనుష్, ఐశ్యర్య ముగింపు పలకబోతున్నారనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Dhanush
Aishwarya Rajinikanth
Dovorce
Kollywood

More Telugu News